జగన్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

జగన్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

ఎప్పుడూ జగన్ పై విమర్శల జడివాన కురిపించే చంద్రబాబు కూడా ఏదో ఒక సందర్భంలో అయినా తన మనసులో మాట బైటపెడుతుంటారు. అలాంటి సందర్భమే ఇటీవల జరిగిన పార్టీ భేటీలో చోటు చేసుకుంది. సీనియర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు జగన్ ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటూనే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నవరత్నాలు, మిగతా పథకాల సంగతి ఎలా ఉన్నా.. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల పోస్ట్ ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే కాదు, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని విజయతీరం చేర్చేదిలా ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తంచేశారు. మనకెందికీ ఆలోచన రాలేదని కుమిలిపోయారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 1,34,500 ఉద్యోగాల భర్తీ అంటే మాటలు కాదు, గ్రామ, వార్డ్ వాలంటీర్ పోస్ట్ లు వీటికి అదనం. ఒక్కసారిగా గ్రామీణ స్థాయిలో, పట్టణాల్లో ఉన్న నిరుద్యోగ సమస్యను చేతితో తుడిచేసినట్టు చేశారు జగన్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి ఇలాంటి ఆలోచన రాకపోవడం నిజంగా ఆయన దురదృష్టమే. కేవలం చంద్రబాబుకే కాదు, ఇతర రాష్ట్రాల సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులు కూడా ఈ నవయువకుడు చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు, ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంటున్నారు.

అయితే ఇక్కడ చంద్రబాబు తన పార్టీ సహచరుల దగ్గర జగన్ ని మెచ్చుకోవడమే విచిత్రం. సచివాలయ ఉద్యోగాలపై జగన్ హామీ ఇచ్చిన సందర్భంలో అందరూ ఇది అమలయ్యేనా అని టీడీపీ వితండవాదం చేసింది. నోటిఫికేషన్ పడ్డాక ఎవరు ఆసక్తి చూపిస్తారంటూ వెటకారం చేశారు ఆ పార్టీ నేతలు. తీరా పోస్టింగ్ లు ఇచ్చే సమయానికి పేపర్ లీక్, రాజకీయ సిఫార్సులు అంటూ నానా రాద్ధాంతం చేశారు. ఇప్పుడా ఆరోపణల్లో కూడా పసలేదని తేలిపోయింది.

మొత్తమ్మీద గ్రామ సచివాలయం, సచివాలయాలతో లక్షా 35వేల నూతన ఉద్యోగాల కల్పన అనే కాన్సెప్ట్ బ్రహ్మాండంగా సక్సెస్ కావడంతో చంద్రబాబు మనసులో మాట తన పార్టీ ముఖ్యుల దగ్గర బైటపెట్టారు. పైకి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నా.. తనకిలాంటి ఆలోచన రానందుకు లోలోన మథనపడుతున్నారు చంద్రబాబు.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *