వైస్ జగన్‌ ప్రభుత్వ లక్యం అదే !

వైస్ జగన్‌ ప్రభుత్వ లక్యం అదే !

ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తన ప్రభుత్వ లక్యంగా జగన్‌ ముందుకు వెళ్తున్నాడు. కానీ మళ్లీ ఎలాగైనా సీఎం అవ్వాలనే అత్యాశతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. అంతెందుకు మహిళల విషయానికే వద్దాం ఓట్లుతో సంబంధం లేకుండా రిజర్వేషన్లలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైస్ జగన్‌ ప్రభుత్వమే.. ఇది కాదనలేని నిజం. ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని జగన్ ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నాడు. మరి బాబు ఏమి చేశాడు ? గత ఎన్నికల్లో ఓట్లు దండుకోనేందుకు పసుపు-కుంకుమ పేరుతో మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ చివరికీ వాళ్లే బాబును మోసం చేశారనుకోండి. వాళ్ళు అలా మోసం చేయడానికి ప్రధాన కారణం బాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాటలు చెప్పి.. కాలం వెళ్లబుచ్చాడు. కానీ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ పాలనలో ఆ తరువాత మహానేత వైఎస్సార్‌ హయాంలో.. నేడు జగన్‌ పరిపాలనలో సామాన్య ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే జగన్ ప్రభుత్వం అక్టోబర్ 15న రైతు భరోసా, అలాగే ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నామని ప్రకటించింది. అదేవిధంగా జనవరి 15న అమ్మఒడి, పేదలకు ఉగాది నాటికి ఇంటి స్థలాలు, పక్కా ఇల్లు అందుతాయని జగన్ స్పష్టం చేశారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న జగన్.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని అవలీలగా ప్రకటించేయడం.. అమలు పరచడం.. ఈ తరంలో ఒక్క జగన్ కే చెల్లిందని చెప్పుకోవాలి. కాగా అభివృద్ధి కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, తన తండ్రి ప్రారంభించినటువంటి ఆరోగ్య శ్రీ పథకంలో ఎన్నో కీలకమైన మార్పులు చేసి, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలందరికి మరింత చేరువ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం పై పూర్తిగా నిషేదించి.. అందుకుగాను వారందరికీ కూడా అధిక వేతనాలు ఇవ్వాటానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇకపోతే కేవలం ఇక్కడే కాకుండా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయనున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలతో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *