గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూల్స్ ఇవే…!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల సమయంలోనే గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి, ఎంపికయిన వారికి నియామకపత్రాలను పంపిణీ చేయటం జరిగింది. అక్టోబర్ నెల 2వ తేదీ నుండి ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయిన వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నియమ నిబంధనలు ఉన్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలను అందుకున్నవారు తప్పనిసరిగా 30 రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. 30 రోజుల్లో విధులకు హాజరు కాని పక్షంలో హాజరు కాని వారిని ఎంపిక జాబితా నుండి తొలగిస్తారు. ప్రభుత్వ వైద్యశాలల నుండి ఈ ఉద్యోగాలలో చేరే అభ్యర్థులు బాడీ ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్లో కేంద్రంలో లేదా రాష్ట్రంలో పని చేస్తున్న వారు ఆ సంస్థల నుండి బయటకు వచ్చేసినట్లు ధ్రువపత్రం ఖచ్చితంగా సమర్పించాలి.

ఎవరైనా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలితే వారు ఉద్యోగం కోల్పోవటంతో పాటు ప్రభుత్వం వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల పాటు గౌరవ వేతనం కింద 15,000 రూపాయలు చెల్లిస్తుంది. ప్రభుత్వానికి ఈ రెండు సంవత్సరాల సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగాలకు ఎంపికయిన వారిని విధుల నుండి తొలగించే అధికారం ఉంది.

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఈ రెండు సంవత్సరాల కాలంలో నిర్దేశిత ప్రమాణాలకు తగిన ప్రతిభ కనబరిస్తే శాశ్వత స్కేలులోకి ప్రభుత్వం తీసుకుంటుంది. లేకపోతే ప్రభుత్వానికి తొలగించే హక్కు కూడా ఉంది. మూడు సంవత్సరాల కాలంలో ఉద్యోగం వదిలి వెళ్లాలనుకుంటే అప్పటివరకు అందుకున్న గౌరవ వేతనాలతో పాటు, భత్యాలు కూడా వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. పరిమితులకు, నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే నెల రోజుల నోటీసుతో ఉద్యోగం నుండి తొలగించే అవకాశం ఉంది.

 

జగన్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

ఎప్పుడూ జగన్ పై విమర్శల జడివాన కురిపించే చంద్రబాబు కూడా ఏదో ఒక సందర్భంలో అయినా తన మనసులో మాట బైటపెడుతుంటారు. అలాంటి సందర్భమే ఇటీవల జరిగిన పార్టీ భేటీలో చోటు చేసుకుంది. సీనియర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు జగన్ ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటూనే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నవరత్నాలు, మిగతా పథకాల సంగతి ఎలా ఉన్నా.. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల పోస్ట్ ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే కాదు, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని విజయతీరం చేర్చేదిలా ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తంచేశారు. మనకెందికీ ఆలోచన రాలేదని కుమిలిపోయారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 1,34,500 ఉద్యోగాల భర్తీ అంటే మాటలు కాదు, గ్రామ, వార్డ్ వాలంటీర్ పోస్ట్ లు వీటికి అదనం. ఒక్కసారిగా గ్రామీణ స్థాయిలో, పట్టణాల్లో ఉన్న నిరుద్యోగ సమస్యను చేతితో తుడిచేసినట్టు చేశారు జగన్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి ఇలాంటి ఆలోచన రాకపోవడం నిజంగా ఆయన దురదృష్టమే. కేవలం చంద్రబాబుకే కాదు, ఇతర రాష్ట్రాల సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులు కూడా ఈ నవయువకుడు చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు, ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంటున్నారు.

అయితే ఇక్కడ చంద్రబాబు తన పార్టీ సహచరుల దగ్గర జగన్ ని మెచ్చుకోవడమే విచిత్రం. సచివాలయ ఉద్యోగాలపై జగన్ హామీ ఇచ్చిన సందర్భంలో అందరూ ఇది అమలయ్యేనా అని టీడీపీ వితండవాదం చేసింది. నోటిఫికేషన్ పడ్డాక ఎవరు ఆసక్తి చూపిస్తారంటూ వెటకారం చేశారు ఆ పార్టీ నేతలు. తీరా పోస్టింగ్ లు ఇచ్చే సమయానికి పేపర్ లీక్, రాజకీయ సిఫార్సులు అంటూ నానా రాద్ధాంతం చేశారు. ఇప్పుడా ఆరోపణల్లో కూడా పసలేదని తేలిపోయింది.

మొత్తమ్మీద గ్రామ సచివాలయం, సచివాలయాలతో లక్షా 35వేల నూతన ఉద్యోగాల కల్పన అనే కాన్సెప్ట్ బ్రహ్మాండంగా సక్సెస్ కావడంతో చంద్రబాబు మనసులో మాట తన పార్టీ ముఖ్యుల దగ్గర బైటపెట్టారు. పైకి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నా.. తనకిలాంటి ఆలోచన రానందుకు లోలోన మథనపడుతున్నారు చంద్రబాబు.

ప్రతీ జనవరికి రెడీగా ఉండండి…జగన్ సంచలనం

ప్రతి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన యువతకు జగన్ నియామక ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అందుకని నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకోవటానికి రెడీగా ఉండాలంటూ పిలుపుకూడా ఇచ్చారు.

మొత్తానికి చెప్పిన మాట గనుక జగన్ నిలబెట్టుకుంటే ప్రతిపక్షాల పని అందులోను చంద్రబాబునాయుడు పని దాదాపు అయిపోయినట్లే. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ దాదాపు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయల్లో వివిధ ఉద్యోగాలను భర్తీతో శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదే వరసను గనుక కొనసాగిస్తే దాదాపు లక్షలాది ఉద్యోగాలను జగన్ భర్తీ చేసేట్లే కనిపిస్తున్నారు. అదే గనుక జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే తాను సిఎంగా ఉన్న కాలంలో ఏనాడు ఉద్యోగాల కల్పన చేసింది లేదు. మొన్న ఐదేళ్ళ అధికారంలో కూడా డిఎస్సీ ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలైతే చేశారు కానీ భర్తీ మాత్రం చేయలేదు.మొక్కుబడి ప్రకటనలు చేసి జనాలను మోసం చేసేవాళ్ళకు, ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చే వాళ్ళకు జనాలు తేడాను బాగానే గ్రహించారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపి గూబగుయ్యిమనిపించారు.

తాజాగా జగన్ భర్తీ చేసిన వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలతో మిగిలిన నిరుద్యోగులకు కూడా ఆశలు చిగురించటం ఖాయంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోచుకోకుండా సంవత్సరాల తరబడి ఉండిపోయాయి. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నట్లుగా జగన్ ఆడుకునేందుకు సిద్దంగా లేరు. అందుకే ప్రతీ జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తానని జగన్ ప్రకటించగానే అందరూ హర్షం తెలుపుతున్నారు.

కులాలు.. మతాలు..రాజకీయాలు..పార్టీలు చూడొద్దు : సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేయటం కొరకు హాజరయ్యారు. సచివాలయ రాత పరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ల పరీశీలన కూడా పూర్తయిన వారికి సీఎం జగన్ నియామక పత్రాలను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా 20 లక్షల కంటే ఎక్కువమంది ఉద్యోగాల కొరకు హాజరు కావటం దాదాపుగా 1,40,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావటం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు.

నాలుగు నెలలు పూర్తి కాకముందే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ అన్నారు. సొంత మండలంలోనే ఉద్యోగం వచ్చే అదృష్టం ఎంతో తక్కువ మందికి వస్తుందని అన్నారు. లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పారదర్శక పాలన అందించాలని సీఎం కోరారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకొనిరావాలని జగన్ అన్నారు.

ప్రజలకు సేవలు అందించటం కొరకు ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. గ్రామాలలో పాలనావ్యవస్థ వెంటిలేటర్ పై ఉంది. ఇటువంటి వ్యవస్థను బాగు చేసేందుకు ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని తీసుకొచ్చామని అన్నారు. 72 గంటల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వచ్చిన వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వును ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు.

2020 జనవరి 1వ తేదీ నుండి గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని జగన్ కోరారు. కులాలు, మతాలు, రాజకీయలు, పార్టీలు చూడొద్దని జగన్ అన్నారు. 2019 ఎన్నికల్లో మనకు ఓటు వేయనివారు కూడా పరిపాలనను చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు.

నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు : మంత్రి బొత్స…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్ది గారు పాదయాత్ర చేసిన సమయంలో ఎంతోమంది జగన్ ను కలిసి వారి బాధలు, వేదనలు చెప్పిన తరువాత వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే, వ్యవస్థను మెరుగుపరచాలంటే ఒక కొత్త ప్రయోగం చేయాలి మరియు కొత్త ఒరవడిని తీసుకొనిరావాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పూర్తి కాకముందే నాలుగు నెలల్లో 4 లక్షల పది వేల ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలలోని హామీలను మాత్రమే కాకుండా, ప్రజలకు మేలు చేసే ప్రతి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. 1,34,000 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు మాత్రమే కాక 2,70,000 గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

గ్రామీణ వ్యవస్థ, పట్టణ వ్యవస్థ అభివృద్ధిలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ భాగస్వామ్యులను చేస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. మీరు ఏదైనా పొరపాటు చేస్తే ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి వస్తుందని బొత్స అన్నారు.చంద్రబాబునాయుడు గారు వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు వాలంటీర్లపై చులకనభావంతో వ్యాఖ్యలు చేయటం సరికాదని బొత్స అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మరియు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటికే చేరుతాయని బొత్స అన్నారు.

నాడు వైఎస్.. నేడు జగన్.. అరుదైన అవకాశం

ఒకే కుటుంబం నుంచి.. అదీ సీఎం హోదాలో.. ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఇంతటి అరుదైన అవకాశం ఎవ్వరికీ దక్కలేదట… తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో తండ్రీ కొడుకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ లు సీఎం హోదాలో స్వామి సేవలో పాల్గొనడం అత్యంత అరుదైనదిగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారికి సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇదే స్వామికి పట్టువస్త్రాలు సమర్పించగా.. మళ్లీ ఆయన తనయుడు కూడా సీఎం హోదాలోనే పట్టువస్త్రాలు సమర్పిస్తుండడం విశేషంగా మారింది.

టీటీడీ చరిత్రలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలేషుడికి పట్టువస్త్రాలు సమర్పించడం అత్యంత అరుదైనదిగా భావిస్తున్నారు. సాయంత్రం ధ్వజారోహణ తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం తరుఫున ఈ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గర్భగుడి లోకి వెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు.

సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ముందు పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు కూడా వెంకన్నను దర్శించుకున్నాకే సీఎం పీఠమెక్కారు. తిరుమలేషుడిని సెంటిమెంట్ గా మార్చుకున్న జగన్ ఇప్పుడు పట్టువస్త్రాలు కూడా తనే స్వయంగా సమర్పిస్తుండడం విశేషంగా మారింది.

హిందూ దేవాలయాలపై జగన్ సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల ఓ అన్యమస్థుడు పనిచేస్తున్నాడని.. అతడి ఇంటిలోని మతం వేడుక చేసుకుంటున్న తీరు గురించి వీడియో సైతం రిలీజ్ చేసి కొందరు రచ్చ చేసిన సంగతి తెలిసింది..దీంతో జగన్ సర్కారు అన్యమతస్థులను టీటీడీపీలో ఉద్యోగాలిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తోందని బీజేపీ సహా చాలా పార్టీలు నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..

అందుకే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసింది. అన్యమతస్థులను అనుమతించరని తెలిపింది. ఈ ఆదేశాలు ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఏపీలోని అన్ని దేవలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేస్తుంటే వారిని వేరే శాఖాల్లో మార్పు చేయాలని ప్రభుత్వం ఆ జీవో స్పష్టం చేసింది.

టీటీడీ సహా ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరులు ఉంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉంటే విజిలెన్స్ శాఖకు అందిస్తే నిజనిర్ధారణ చేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.చర్యలు తప్పవు.. ఒక వేళ అన్యమతంలో కొనసాగుతూ హిందూ దేవాలయాల్లో విధులు నిర్వహిస్తుంటే.. విజిలెన్స్ శాఖకు సమాచారం అందించాలని జీవోలో స్పష్టం చేసింది. సదరు ఉద్యోగుల ఇళ్లల్లో జరిగే పండగలు, పెళ్లిళ్లు, ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్ శాఖకు అందజేస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

బాబు హయాంలోనే.. చంద్రబాబు హయాంలో కూడా అన్యమతస్తులను హిందూ దేవలయాల్లో నియమించారని, వారందరినీ తొలగించాలని హిందూ సంఘాలు ఇటీవల డిమాండ్ చేశాయి. హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు, హిందుయేతర వ్యక్తుల నియామకంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

విమర్శల నేపథ్యంలో.. శ్రీశైలంతోపాటు ఇతర ప్రముఖ దేవాలయాల్లోనూ ఇతర మతస్తులను ఉద్యోగాల్లో నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ ఆలయాల్లో హిందువులను మాత్రమే ఉద్యోగాల్లో నియమించాలనే డిమాండ్లు పెరిగాయి. హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.

వైస్ జగన్‌ ప్రభుత్వ లక్యం అదే !

ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తన ప్రభుత్వ లక్యంగా జగన్‌ ముందుకు వెళ్తున్నాడు. కానీ మళ్లీ ఎలాగైనా సీఎం అవ్వాలనే అత్యాశతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. అంతెందుకు మహిళల విషయానికే వద్దాం ఓట్లుతో సంబంధం లేకుండా రిజర్వేషన్లలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైస్ జగన్‌ ప్రభుత్వమే.. ఇది కాదనలేని నిజం. ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని జగన్ ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నాడు. మరి బాబు ఏమి చేశాడు ? గత ఎన్నికల్లో ఓట్లు దండుకోనేందుకు పసుపు-కుంకుమ పేరుతో మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ చివరికీ వాళ్లే బాబును మోసం చేశారనుకోండి. వాళ్ళు అలా మోసం చేయడానికి ప్రధాన కారణం బాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాటలు చెప్పి.. కాలం వెళ్లబుచ్చాడు. కానీ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ పాలనలో ఆ తరువాత మహానేత వైఎస్సార్‌ హయాంలో.. నేడు జగన్‌ పరిపాలనలో సామాన్య ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే జగన్ ప్రభుత్వం అక్టోబర్ 15న రైతు భరోసా, అలాగే ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నామని ప్రకటించింది. అదేవిధంగా జనవరి 15న అమ్మఒడి, పేదలకు ఉగాది నాటికి ఇంటి స్థలాలు, పక్కా ఇల్లు అందుతాయని జగన్ స్పష్టం చేశారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న జగన్.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని అవలీలగా ప్రకటించేయడం.. అమలు పరచడం.. ఈ తరంలో ఒక్క జగన్ కే చెల్లిందని చెప్పుకోవాలి. కాగా అభివృద్ధి కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, తన తండ్రి ప్రారంభించినటువంటి ఆరోగ్య శ్రీ పథకంలో ఎన్నో కీలకమైన మార్పులు చేసి, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలందరికి మరింత చేరువ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం పై పూర్తిగా నిషేదించి.. అందుకుగాను వారందరికీ కూడా అధిక వేతనాలు ఇవ్వాటానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇకపోతే కేవలం ఇక్కడే కాకుండా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయనున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలతో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫాస్ట్రక్చర్ సంస్థ.. క్లుప్తంగా ‘మెయిల్’.. ఎన్నో ఏళ్ల తెలంగాణ సాగునీటి కల.. కేసీఆర్ కలలుగన్న కాళేశ్వరాన్ని ప్రపంచమే అబ్బురపరిచేలా మూడేళ్లలో పూర్తి చేసింది ఇదే ‘మేఘా’ సంస్థ. మేఘా చేపట్టిన కాళేశ్వరం.. భూగర్భంలో పంప్ హౌస్ లు ఇలా ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్షాత్కారంగా ఈ ప్రాజెక్ట్ నిలిచింది. అలాంటి మేఘా చేతిలో ఇప్పుడు ఏపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రాజెక్టు పడింది.

టీడీపీ నాయకుల దోపిడీకి బలైపోయిన పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పూర్తికాకుండా ఏపీ ప్రజల ఆశలను నీరుగార్చింది. చంద్రబాబు అండ్ ఆయన కాంట్రాక్టర్ల ధనదాహానికి బలైపోయిందని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిగ్గుతేల్చింది. టీడీపీ తీరును ఎండగట్టింది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మిగిలిపోయిన పోలవరం పనులను రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్లారు. దీనిపై టీడీపీ సహా ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. పోలవరం హెడ్ వర్క్స్ తోపాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. ఆ పనుల విలువను రూ.4987 కోట్లుగా నిర్ణయించింది.

తాజాగా ఈ రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ పాల్గొంది. ఈ పనులను గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే -12.6% తక్కువకు శాతానికి అంటే 4358 కోట్ల మొత్తానికి చేపట్టేందుకు మేఘా సంస్థ బిడ్ వేసి ముందుకొచ్చింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.628 కోట్ల నిధుల ఆదా అయ్యింది. జగన్ సర్కారు చెబుతున్న రివర్స్ టెండరింగ్ దక్కిన ప్రతిఫలమిదీ..

ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయటంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మించిన మేఘా ఇప్పుడు ఏపీ కలల ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. . పోలవరం బిడ్ ఓపెన్ చేసిన ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్ధమౌతోంది. కాళేశ్వరంను రికార్డ్ స్థాయిలో పూర్తి చేసిన మేఘా ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోల‘వరం’గా మారనుంది..

ఆ ఒక్క కార్డుంటే చాలు.. అన్ని కార్డులున్నట్టే!

వన్ నేషన్ వన్ ఎలక్షన్…వన్ నేషన్ వన్ లాంగ్వేజ్… ఈ జాబితాలోకి ఇప్పుడు మరో స్లోగన్ వచ్చి చేరింది. దేశంలోని పౌరులందరికీ ఒకేరకమైన గుర్తింపు కార్డు తెచ్చే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్… పాస్ పోర్టు… డ్రైవింగ్ లైసెన్స్.. ఓటరు కార్డు…వీటన్నింటినీ కలిపి ఒకే కార్డుగా తీసుకువచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. మరో రెండేళ్లలో చేపట్టే జనాభా లెక్కల నాటికి దీన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఒక్కో అవసరానికి ఒక్కో కార్డు… ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న విధానం ఇదే. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఆధార్ గుర్తింపు కార్డు ఉన్నా.. ఆధార్ అన్నది అన్నింటికీ ప్రత్యామ్నాయం కాదు. దేశం దాటాలంటే పాస్ పోర్టు ఉండాల్సిందే… ఓటు వేయాలంటే ఓటరు ఐడీ తప్పనిసరి. ఇక బండి నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒక వ్యక్తి పేరుతో ఇన్ని కార్డులు ఉండాల్సిన అవసరం ఉందా అన్న అలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఈ అన్ని కార్డులను కలిపి ఒకే కార్డుగా మార్చి దేశమంతా ఒకే గుర్తింపు కార్డును తేవాలనుకుంటోంది.

దేశవ్యాప్తంగా బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా… మల్టీపర్పస్ ఐడీ కార్డుపై మాట్లాడారు. జాతీయ పౌర రిజిస్టర్‌…అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతున్న కేంద్రం…దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి డేటాతో మల్టీపర్పస్ ఐడీ కార్డును తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఓ వ్యక్తి చనిపోతే ఆ డేటా ఆటోమెటిక్‌గా అప్‌డేట్‌ అయ్యే వ్యవస్థను తీసుకురావాలన్నారు అమిత్ షా.

2021లో దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల కార్యక్రమం నాటికి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. జనాభా లెక్కల సేకరణను ఈ సారి పూర్తిగా డిజిటల్ రూపంలో చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను కూడా తీసుకువస్తున్నారు. జనాభా లెక్కల సేకరణను మొక్కుబడిగా నిర్వహించకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేస్తామంటోంది బీజేపీ.